AP: గుంటూరు జిల్లాలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారకరమన్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. హాస్టల్లోని మిగిలిన విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా చూడాలని, వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు.