SDPT: సీఎం రేవంత్ రెడ్డి నర్మెట పర్యటనను అడ్డుకుంటామని MRPS నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవులపల్లి రాజేందర్ హెచ్చరించారు. నంగునూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు,రాజీవ్ యువ వికాసం అమలు చేయని సీఎం తీరుకు నిరసనగా దళిత సామాజిక వర్గాలను ఏకం చేస్తామని ప్రకటించారు.