MDK: వంట గ్యాస్ సిలిండర్లు వ్యాపారానికి వినియోగిస్తే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని రామాయంపేట ఎస్సై బాలరాజు హెచ్చరించారు. మండల కేంద్రంలోని పలు హోటల్లు, టిఫిన్ సెంటర్లలో బుధవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. వంట గ్యాస్ అక్రమ వినియోగం చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరైనా గ్యాస్ అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.