AP: తిరుమలలో అన్నదాన సత్రానికి భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సాధారణంగా రోజుకు 75 వేల మందికి అన్నప్రసాదం వడ్డిస్తుండగా, నిన్న ఆ సంఖ్య 85,960కి చేరింది. గ్యాస్ కొరత కారణంగా పలు హోటళ్లు మూతపడటమే ఈ రద్దీకి ప్రధాన కారణమని తెలుస్తోంది. నిన్నటితో పోలిస్తే భక్తుల సంఖ్య 10 శాతం మేర పెరగడంతో టీటీడీ అధికారులు అన్నప్రసాద పంపిణీలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.