AP: కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఈశ్వర్‌కుమార్ సతీమణి మధురిమ రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి తిరిగి రాగానే.. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. సుమారు 10 కిలోల వెండి, పూజా సామాగ్రి అపహరణకు గురైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.