KNR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ డ్రగ్స్ మాత్రమే కాకుండా మద్యం పరీక్షలు కూడా నిర్వహించాలని సవాల్ విసిరారు. కేటీఆర్‌పై కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. అధికార దుర్వినియోగంపై ఆరోపణలు చేస్తూ విచారణ జరపాలన్నారు.