PPM: గరుగుబిల్లి మండలం రావుపల్లి-అజ్జాడ రహదారి గోతులతో అధ్వానంగా తయారైంది. దీంతో మార్గంలో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీన్ని అభివృద్ధి చేయాలని పరిసర గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు. అదే జరిగితే గరుగుబిల్లి, సీతానగరం, బలిజి పేట మండలాల పరిధిలోని గ్రామాల రైతులు తమ పొలాల నుంచి పంటలను తరలించడానికి వీలుంటుందని రైతులు తెలిపారు.