TG: శంషాబాద్లో రైల్వే మెగా కోచింగ్ డిపో కోసం భూసేకరణను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీవో 111 నిబంధనల ఉల్లంఘన, పర్యావరణ అనుమతులు లేకపోవడంపై పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరీవాహక ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు, దీనిపై స్పందించాలని అధికారులకు నోటీసులు జారీ చేసింది.