మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. సంగమ్నేర్లో ఐదో తరగతి విద్యార్థినిపై ఓ వ్యక్తి యాసిడ్తో దాడి చేశాడు. బాలికను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.