MDK: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని తనిఖీ చేసి, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు మరియు వైద్య సేవలు ప్రజలకు వేగంగా అందాలని అధికారులను ఆదేశించారు.