TG: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్ నుంచి ORR వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అభిషేక్‌పై గతంలోనూ పలు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో రోహిత్ రెడ్డికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అభిషేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.