HYD: నగరంలో అనేకచోట్ల రాత్రి వర్షం కురిసింది. బాలానగర్, ఆసిఫ్ నగర్, హయత్ నగర్, ఉప్పల్, నాచారం, చిలుకా నగర్, నాంపల్లి, ఖైరతాబాద్ సహా అనేక చోట్ల వర్షం కురువగా దాదాపుగా 2.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నగరంలో కురిసిన చిరుజల్లులతో నగరం వాతావరణం చల్లగా మారింది. రాబోయే రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.