CTR: మెడికల్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ కిట్లు, నార్కోటిక్ డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఔషధ నియంత్రణ, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమావేశాలు నిర్వహించారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు విక్రయించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.