NZB: సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామంలో గురువారం సిరికొండ తహసీల్దార్ రవీందర్రావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు, గ్రామ ప్రజల కోసం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వనిత నర్సింగ్, ఉప సర్పంచ్ రాము, గ్రామ శాఖ నర్సారెడ్డి, కిసాన్ కేత్ నర్సారెడ్డి ఉన్నారు.