W.G: పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో గతంలో స్మశాన వాటిక కేటాయించాలంటూ రోడ్డుమీద ధర్నా చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు స్మశాన వాటిక కేటాయించకపోవడం చాలా దారుణమని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ అన్నారు . ఈ సందర్భంగా ఆచంట నియోజకవర్గ అధ్యక్షులు కుసుమే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం మళ్లీ ధర్నా చేపట్టారు.