పాక్ ప్లేయర్ షాహిబ్జాదా ఫర్హాన్ T20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన 4వ ఆటగాడిగా కోహ్లీ రికార్డ్(9) సమం చేశాడు. PSL-2026లో ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ఆడుతున్న అతను.. హైదరాబాద్ కింగ్స్మెన్పై 106 రన్స్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా 22 సెంచరీలతో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా.. బాబర్ ఆజం(11), డేవిడ్ వార్నర్(10) తర్వాతి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు.