హనుమాన్ జయంతి పురస్కరించుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం నుంచి సరికొత్త ఫొటోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పవిత్ర దినాన అందరికీ ఆ హనుమంతుడి బలం, భక్తి, సానుకూలత లభించాలని కోరుకుంటూ చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. రామ్ చరణ్ పవర్ఫుల్ లుక్ చూస్తుంటే ఈ సినిమాతో ఆయన మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించేలా కనిపిస్తున్నాడు.