శర్వానంద్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం. శర్వా, శ్రీను వైట్ల కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక యాక్షన్ కామెడీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పూజ కథానాయికగా నటించనున్నట్టు టాక్. ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలుపెట్టి, 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.