పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ ఆల్బమ్ తరహా ఐటెం సాంగ్ ఉంటుందని చాలా మంది ఆశిస్తున్నారు. కానీ అలాంటివి ఏమీ లేవని హరీష్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక ఐటెం గర్ల్ వెనకాల పడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్‌ని చూపించలేను అని ఇప్పుడు తనకి ఉన్న హోదా దృష్ట్యా అలాంటివి చేయడం సబబు కాదని చెప్పినట్లు సమాచారం.