ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో త్రిషను ఉద్దేశించి నటుడు, దర్శకుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై త్రిష కూడా పరోక్షంగా స్పందించడంతో ఆయన మరో పోస్ట్ పెట్టాడు. ‘ఈ విషయంలో జరిగినదంతా తప్పుగా భావించారు. ఇప్పుడు నాకు పశ్చాత్తాపపడటం తప్ప మరో మార్గం లేదు’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ వివాదానికి తెర పడినట్లైంది.