MDK: జిల్లా న్యాయమూర్తి నీలిమను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వారు జిల్లా అభివృద్ధి, న్యాయ పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు. జిల్లాలో ప్రజలకు వేగవంతమైన న్యాయ సేవలు అందించేందుకు పరిపాలన, న్యాయ వ్యవస్థ పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు.