BHPL: జిల్లాలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు చేయనున్న MRI యంత్రం కోసం అవసరమైన గదులు, మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం పరిశీలించారు. MRI గది విస్తీర్ణం, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ సరఫరా, ప్రత్యేక రక్షణ గోడలపై అధికారులతో చర్చించి త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని హెచ్చరించారు.