PDPL: ఓదెలలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఈఏపీసెట్ టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చారు. ట్రినిటీ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో కొలనూరు గ్రామానికి చెందిన కాసరపు కౌశిక్ మొదటి బహుమతి సాధించి ట్యాబ్ అందుకున్నాడు. రెగుల సృజన రూ. 1500 ద్వితీయ బహుమతి, కొమెర గ్రామానికి చెందిన నాగవెల్లీ సాయి హర్షిత రూ. 1000 మూడవ బహుమతి అందుకున్నారు.