NLG: చిట్యాల మండలం పెద్ద కాపర్తి సర్పంచ్‌గా కాటం వెంకటేశం గెలవగానే, గ్రామంలో అమ్మాయిల పెళ్లికి రూ. 10,016 ఇస్తానని దేవస్థాన ఛైర్మన్ ఓర్సు రాజకుమార్ ప్రకటించారు. తాజాగా నూతి శ్రీను కుమార్తె జ్ఞానేశ్వరి వివాహం సందర్భంగా.. సోమవారం ఈ నగదును సర్పంచ్ ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.