కృష్ణా: కృత్తివెన్ను మండలంలోని పలు బాణాసంచా తయారీ కేంద్రాలను కలెక్టర్ బాలాజీ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా బాణాసంచా తయారీ కేంద్రాలు నిర్వహించినా, అనుమతులు పొంది తయారీలో నిబంధనలు ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.