కృష్ణా: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో మార్చి 11వ తేదీన (బుధవారం) ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ సోమవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలు నిరుద్యోగులకు ఇంటర్వ్యూల నిర్వహిస్తాయని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.