T20WC విజయంపై భారత క్రికెటర్ సంజూ శాంసన్ స్పందించాడు. ‘నా దేశం కోసం గెలవాలి అనేది నా కల. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నా చిన్ననాటి రోజుల నుంచి పరిస్థితులను సానుకూలంగా చూడటానికి నేను ట్రైన్ అయ్యాను. సాధారణంగా బాధలు, ఎదురుదెబ్బలు నన్ను చాలా బలవంతుడిని చేశాయి. వాటిని సానుకూలంగా ఉపయోగించినట్లయితే, మీ జీవితంలో గొప్ప బలం అవుతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నాడు.