AP: TG డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ శ్రీకాళహస్తీశ్వరుడి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో వెళ్లిన ఆయనకు దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఫ్యామిలీని వేద పండితులు ఆశీర్వదించి.. తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ శాలువాతో సన్మానించారు.