TG: HYD కూకట్ పల్లి నల్లచెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. చెరువు వద్ద రేవంత్ రెడ్డి గంగా హారతి ఇచ్చారు. హైదరాబాద్ లో వరద ముప్పును తప్పించాలంటే.. చెరువులు అభివృద్ధి జరగాలన్నారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఓపికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పేదల ఇళ్లు కూల్చడం తన ఉద్దేశం కాదన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.