NRML: గ్రామపంచాయతీ సిబ్బందికి, కార్మికులకు ఇవ్వాల్సిన మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ నిర్మల్ జిల్లా కార్యదర్శి బి.సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం కడెం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మండల కమిటీ సమావేశం నిర్వహించి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. పంచాయతీ సిబ్బందిని 2వ పీఆర్సీ పరిధిలోకి తీసుకు రావాలని, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలన్నారు.