HNK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములను రెవెన్యూ రికార్డుల్లో తక్షణమే ప్రభుత్వ భూమిగా మార్చాలని అధికారులకు ఆదేశించారు. సేకరించిన భూములపై పాత పట్టాదారుల పేర్లను తొలగించి రికార్డులను అప్డేట్ చేయాలన్నారు.