NRML: కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో గల పట్టుపురుగుల మల్బారి తోటను ఎంపీడీవో సునీత, ఏపీవో జయదేవ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పట్టుపురుగుల పెంపకంపై టెక్నికల్ అసిస్టెంట్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆశించడం కోసం పట్టుపురుగుల పెంపకం కోసం ముందుకు రావాలని సూచించారు.