BPT: సూర్యలంక తీరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పరిశీలించారు. అధికారులతో కలిసి ప్రాంతాన్ని సందర్శించి పనుల స్థితిని సమీక్షించారు. నిర్మాణాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను గడువులో పూర్తి చేయాలని సూచించారు. పర్యాటకంగా సూర్యలంకను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.