MBNR : జిల్లాలో 16 మండలాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవుల నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నాగర్కర్నూల్ జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కావడంతో, తమ జిల్లా తుది జాబితా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ పదవులకు భారీగా పోటీ ఏర్పడింది.