MBNR: వేసవిలో రైతులకు సాగునీటి కోసం విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని ఏఈ దేవేందర్ నాయుడు తెలిపారు. ఆదివారం హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. సాంకేతిక లోపాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని లైన్మెన్లను ఆదేశించారు. రైతులు అప్రమత్తంగా ఉండి సమస్యలను తెలియజేయాలని సూచించారు.