BHNG: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేయడం అభినందనీయమని ఎంఈవో శరత్ యామిని అన్నారు. యాదగిరిపల్లి, దాతరుపల్లి హైస్కూళ్లలో 200 మంది టెన్త్ విద్యార్థులకు కోమటిరెడ్డి యువసేన నేత ధార నవీన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, జామెట్రీ బాక్సులు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, యువసేన ప్రతినిధులు పాల్గొన్నారు.