KRNL: వెల్దుర్తి మండలం సూదేపల్లె గ్రామంలో రైతు మాదన్నకు చెందిన జామ తోటకు దుండగులు నిప్పంటించారు. ఘటనలో సుమారు 200 జామ చెట్లు దగ్ధమై రూ. 50,000 వరకు నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం బాధిత రైతుకు అందించాలని సీపీఐ, ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జామ మొక్కలు ఇచ్చి రైతును ఆదుకోవాలని నాయకులు కోరారు.