E.G: మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఈ నెల 12వ తేదీన రాజమండ్రిలో ‘జన్ సున్ వాయి’ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ & సాధికారిత అధికారి టి.శ్రీదేవి తెలిపారు. డ్రైవ్లో జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్, పోలీస్ సిబ్బంది పాల్గొంటారన్నారు. మహిళా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.