GDWL: రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకుని ప్రశాంత జీవనం గడపడమే రాజామార్గం అని మొదటి అదనపు ప్రధాన న్యాయమూర్తి ఎస్. రవికుమార్ అనారు. ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రాజీపడదగ్గ క్రిమినల్ కేసుల్లో ఇరు వర్గాలను సమన్వయపరిచి, వారికి లోక్ అదాలత్ ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.