AP: విజయవాడలో డాక్టర్ దీపిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, డాక్టర్ అమర్ మోసం చేయడమే ఇందుకు కారణమని పోలీసులు గుర్తించారు. గత నెల 5న ప్రమాదకర ఇంజెక్షన్ తీసుకుని దీపిక సూసైడ్ చేసుకున్నారు. అయితే, ఆత్మహత్యకు ముందు ఆమెతో అమర్ మాట్లాడినట్లు నిర్ధారించారు. దీంతో నిందితుడు అమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.