NLG: కొండ భీమనపల్లిలో చోరీకి పాల్పడిన నాగర్ కర్నూల్ జిల్లా వాసి ఎండీ మెహబూబ్ పాషాను అరెస్టు చేసినట్లు సీఐ వెంకటరెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 21న కొండ భీమనపల్లిలో చోరీకి పాల్పడిన నిందితుడిని వాహన తనిఖీల్లో పట్టుకున్నామన్నారు. అతని వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు, చాంద్ పాషా, సతీష్, పాల్గొన్నారు.