SRD: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 13న ఉదయం 10 గంటలకు రాష్ట్ర డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ తుల్జా నాయక్ తెలిపారు. మహేంద్ర అండ్ మహీంద్రా పరిశ్రమలు 800కి పైగా ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.