NGKL: అచ్చంపేట మండలం కొండనాగుల గ్రామంలో సోమవారం లక్ష్మీ చెన్నకేశవ స్వామి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ చిన్నజీయర్ స్వామి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ అద్భుత వేడుకకు తనను ఆహ్వానించినందుకు ఆలయ కమిటీకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.