హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ 148 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిని శాఖల వారీగా విభజించి ఆయా అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.