HYDలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (IIRR) అభివృద్ధి చేసిన DRR ధాన్–75 వరి రకానికి రైతుల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని పెంచి మార్కెట్లో విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని IIRR నిర్ణయించింది. ఇందుకు RR అగ్రిటెక్ సంస్థతో MOU కుదుర్చుకుంది. IIRR నిర్దేశించిన ధరలకే విత్తనాలను విక్రయించనున్నారు.