GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కొరిటెపాడు మాజేటి రామ్ కళ్యాణ మండపంలో ఎన్డీయే కూటమి మహిళా నేతల ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మహిళలు ఘనంగా సత్కరించారు.