NDL: రబి సీజన్‌కు సంబంధించి బండి ఆత్మకూరు మండలంలో 15,740 మంది రైతులు 36,303 ఎకరాల్లో పంటల సాగుకు సంబంధించి ఈ-పంట నమోదు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలిపారు. బండి ఆత్మకూరు మండలం ఏ- కోడూరు రైతు సేవ కేంద్రంలో ప్రదర్శించి ఈ- పంట ముసాయిదా జాబితా ప్రదర్శనను ఇవాళ ఆయన పరిశీలించారు. తప్పులుంటే రైతు సేవ కేంద్రం సిబ్బందికి తెలియజేసి సరి చేసుకోవాలన్నారు.