AKP: ఎస్.రాయవరం మండలంలో రబీ సీజన్లో ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుల జాబితాలను సంబంధిత రైతుసేవా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నట్లు ఏవో సౌజన్య సోమవారం తెలిపారు. నేటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు ప్రతి రైతు సేవా కేంద్రంలోనూ గ్రామసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సభల్లో ఈ-క్రాప్ నమోదు వివరాలు తెలియజేస్తామన్నారు. సవరణలు ఉంటే పోర్టల్లో సరి చేయించుకోవాలన్నారు.