TG: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇప్పటివరకూ బాధితులకు ప్రభుత్వం అండగా లేదని విమర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి వైద్య సహాయం కూడా అందలేదన్నారు. ఈ క్రమంలో అక్కడ ఆందోళన చేపట్టిన కవితకు.. పోలీసులు అక్కడికి చేరుకొని సర్ది చెప్పడంతో ఆమె నిరసనను విరమించుకున్నారు.