ATP: జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 463 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.